NLR: గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి మాచర్ల న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దవడంతో సుప్రీంకోర్టు సూచన మేరకు ఇద్దరు సోదరులు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. అనంతరం వారిని అధికారులు నెల్లూరు జైలుకు తరలించారు.