NRML:మొదటి దశ పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసాయి. మొత్తం 80.28 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండలాల వారీగా దస్తురాబాద్ 80.22, కడెం 79.87, ఖానాపూర్ 79.16, లక్ష్మణ చందా 81.14 మామడ 79.65, పెంబి 83.46 శాతం ఓటింగ్ నమోదయిందని వారు పేర్కొన్నారు.