ఆసిఫాబాద్ డివిజన్లో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP నితికా పంత్ పేర్కొన్నారు. 750 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా గొడవలకు ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.