PPM: సాలూరు మండలంలో సర్వే చేయని నాలుగు గ్రామాల ప్రచురణ కోసం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి బుధవారం సంయుక్త తనిఖీ చేశారు. నందా అటవీ బ్లాక్‌లోని కుడకూరు, మడకారు, సిఖపరువు, కొనదార గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. అందులో భాగంగా కుడకూరు, మడకారు గ్రామాల్లో సర్వే ఏడీ, సాలూరు తహసిల్దార్‌తో పర్యటించి సంయుక్త తనిఖీ చేసిన పలు మార్గదర్శకాలు ఆమె జారీ చేశారు.