గద్వాల జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం ఉదయం ఐడీఓసీ సమావేశ మందిరం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. గద్వాల, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో పోలింగ్ సిబ్బంది విధులను ఆయన అదనం కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు.