తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 843 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 740క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను ఒకరోజు 20 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్‌లో మన కలెక్టర్‌కు సీఎం రాష్ట్రంలో 12వ ర్యాంకు ఇచ్చారు.