కృష్ణా: జిల్లా SP వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఘంటసాల పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం గ్రామ శివారులోని డొంక ప్రాంతంలో అక్రమంగా జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 28,650 నగదు, ఆరు బైకులు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.