WGL: ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ సత్యశారద దేవి అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో పోలింగ్ బూత్‌ను ఇవాళ ఉదయం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలు పరిశీలించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.