BHPL: మొగుళ్ళపల్లి, గోరికొత్తపల్లి, రేగొండ, గణపురం మండలంలో ఈరోజు జరిగే మొదటి విడత ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఓటు వేయడానికి అవసరమైన సహాయం అందించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో గుమికూడటం నిషేధమని స్పష్టం చేశారు.