BHNG: జిల్లాలో డిసెంబరు 11న యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, ఆలేరు, తుర్కపల్లి, ఆలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఆంక్షలు విధించనున్నారు. అలాగే 14న భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట, వలిగొండలో, 17న గుండాల, మోటకొండూరు, చౌటుప్పల్, నారాయణపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ (144) సెక్షన్ విధించారు.