BDK: అశ్వాపురంలో ఉదయం 7 గంటల నుంచి గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అశ్వాపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందికి ఓటర్లకు సూచనలు చేశారు.