ATP: జిల్లాలో ‘స్క్రబ్ టైఫస్’ మహమ్మారి అలజడి రేపుతోంది. తాజాగా హిందూపురం మండలం కిరికెరకు చెందిన ఓ మహిళకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆమె ప్రస్తుతం అనంతపురం సర్వ జన ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 102 రక్త నమూనాలు పరీక్షించగా, ఆరుగురికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేలింది.