KRNL: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుంటే తప్పనిసరిగా జరిమానాలు కట్టాల్సి వస్తుందని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ అన్నారు. బుధవారం కర్నూల్ నగరంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రజలకు హెల్మెట్ ధరించడంపై ఆయన అవగాహన కల్పించారు. చట్టాలను గౌరవించి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆయన సూచించారు. రహదారి భద్రతకు హెల్మెట్ తప్పనిసరి అని తెలిపారు.