జగిత్యాల జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల వేళ సంస్థలలో, దుకాణాలలో, ఫ్యాక్టరీలలో తదితర చోట్ల పనిచేసే కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని జిల్లా సహాయ కార్మిక కమిషనర్ సురేంద్ర కుమార్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను యజమానులు పాటించాలన్నారు.