MBNR: జడ్చర్ల మండల కేంద్రంలో కల్వకుర్తికి వెళ్లే రోడ్డు సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నప్రసాద షెడ్డును ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. తన సొంత నిధులు రూ. 8 లక్షలతో ఈ షెడ్డును ఎమ్మెల్యే నిర్మించారు. అలాగే, స్వామివారి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. దేవాలయం అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడి ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.