SDPT: దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామంలో కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనతో ఓ వ్యక్తి గాయపడ్డారు. ఎన్నికల సమయంలో బందోబస్తు వాహనాన్ని వేగంగా ప్రజలపై తీసుకురావడంతో ఓ వ్యక్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రి సైతం గ్రామంలో యువకులను ఇబ్బందుల గురిచేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కానిస్టేబుల్ నవీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.