NZB: బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో వర్ని, కొటగిరి, రూద్రూర్, చందూర్ మోస్రా మండలాల్లో పోలింగ్ సమయం ముగిసే సమయానికి 80.50 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు కేంద్రాల్లో కౌంటింగ్ మొదటగా వార్డు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.