KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గురువారం అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు పరిశీలించారు. ఎల్.గోవిందపురం, బోనకల్, నాగులవంచ సహా పలు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.