SKLM: పలాస మున్సిపాలిటీ శివాజీ నగర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సంక్షేమ బాలికల పాఠశాలను గురువారం రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పాఠశాలలో ఉన్న సదుపాయాలు, విద్యార్థుల వసతి పరిస్థితులు, భోజన నాణ్యత వంటి అంశాలను వంటగది, హాస్టల్ గదులు, ప్రాంగణాన్ని పరిశీలించారు.