GNTR: రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తుందని గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు. పిన్నెల్లి సోదరులు కోర్టులో సరెండర్ అవుతుంటే వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఏ దిశగా పాలన తీసుకెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రశ్నించిన ప్రతీఒక్కరిని జైళ్ళల్లో వేసుకుంటూ వెళితే జైళ్ళు ఖాళీగా ఉంటాయా ప్రశ్నించారు.