AP: మంత్రివర్గ సమావేశం ముగిసింది. కేబినెట్ భేటీకి పలువురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించనున్నారు. మ.3 గంటలకు ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తారు.