E.G: రాజమండ్రి రూరల్ 21వ వార్డులో ఉన్న శ్రీశ్రీశ్రీ బాల త్రిపురసుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఛైర్మన్గా బోలిశెట్టి శ్రీనివాస్, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.