తమిళ హీరో కార్తీతో దర్శకుడు నలన్ కుమార్ స్వామి తెరకెక్కించిన సినిమా ‘వా వాతియర్'( తెలుగులో ‘అన్నగారు వస్తారు’). అయితే రేపు విడుదల కావాల్సిన ఈ మూవీ.. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రంలో కృతి శెట్టి, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.