కృష్ణా: గుడివాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఐ.యమ్.ఏ హాల్ రోడ్డులో గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం నుంచి గుడివాడకు వస్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై ముందుకు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో, బస్సు నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న గొయ్యిలోకి దిగబడింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.