MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో ఎఫ్ఎస్టీ బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను లోపాలకు గురి చేయకుండా డబ్బు, మద్యం అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.