కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. తనపై ఉన్న మిగతా 3 అత్యాచార కేసులను వేరే జడ్జికి బదిలీ చేయాలన్న ఆయన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఒక కేసులో శిక్ష వేసినంత మాత్రాన.. మిగతా కేసుల్లోనూ జడ్జి ప్రభావితం అవుతారని అనుమానించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. సాక్ష్యాల ఆధారంగానే తీర్పు ఉంటుందని తేల్చిచెప్పింది.