సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం గోలాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు డీటీ. హరి, ఎం. విజయ్ కుమార్, కెఆర్. హరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హిందూపురం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ టీఎన్. దీపిక వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.