కృష్ణా: దేవాలయ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజశేఖర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఘనంగా జరిగింది. నూతన ఛైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య), పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే సత్కరించారు.