Jgl: ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ సర్పంచ్‌గా తొగరి రచన గెలుపొందారు. సర్పంచ్ ఎన్నికల్లో రచన తన సమీప అభ్యర్థి నల్ల నవనీతపై 64 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రచనకు 200 ఓట్లు పోలవ్వగా నవనీతకు 136 ఓట్లు పడ్డాయి. రచన స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ పోటీలో పాల్గొన్నారు. ఈ విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.