నటసింహ బాలకృష్ణ ‘అఖండ 2’ మూవీ రేపు విడుదల కానుంది. అయితే ఈ సినిమా రేట్లను పెంచుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది. టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ షోల నిర్వహణపై కోర్టు విచారణ జరిపే అవకాశముంది.