NLR: దగదర్తి(M)ల సీనియర్ తెలుగుదేశం నాయకుడు, విలేకరి వడ్డే శ్రీకాంత్ నాయుడుపై మారణాయుధాలతో దుండగులు హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ దాడిలో శ్రీకాంత్ తల, శరీరానికి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.