ATP: శింగనమల నియోజకవర్గంలో రహదారి అభివృద్ధికి CM చంద్రబాబునాయుడు, Dy.CM పవన్ కళ్యాణ్ రూ. 10.12 కోట్ల నిధులు విడుదల చేశారు. ఆకులేడు-లోల్లూరు రోడ్డుకు రూ. 2.38 కోట్లు, గార్లదిన్నె–కోటంక రోడ్డుకు రూ. 3.86 కోట్లు, వడియంపేట–రేగడికొత్తూరు రోడ్డుకు రూ. 3.88 కోట్లు మంజూరు చేశారు. అభివృద్ధికి చేసిన సహకారానికి ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపారు.