ప్రకాశం: మార్కాపురం బ్లడ్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం దోర్నాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు. రక్తదానం చేయుట ద్వారా మరొకరి ప్రాణాలు కాపాడవచ్చు అని సూపర్డెంట్ రవికుమార్ తెలిపారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు రక్తం అవసరం అన్నారు.