VSP: మధురవాడ వాంబే కాలనీ 5ఏ బ్లాక్ ఎస్ఎఫ్-4లో నివసించే జగదీష్ బుధవారం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మద్యపాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు విచారణ ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.