MDK: ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మద్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్నికల వ్యయ పరిశీలకులు జుల్ఫికర్ అలీ హెచ్చరించారు. రామాయంపేట గజ్వేల్ చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న 480 క్వార్టర్ సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న కారుతోపాటు మద్యాన్ని సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.