JN: సీపీఎం పార్టీ పైన అనుచిత వాక్యాలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బెశరత్గా సీపీఎం పార్టీకి, పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. జనగామలో బుధవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. అలాగే లింగాల గణపురం మండల కార్యదర్శి కరుణాకర్ పై దాడి చేసిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలన్నారు.