MDK: స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నేపథ్యంలో హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆయన కోరారు. ఓటింగ్ ప్రారంభం కాకముందే డ్యూటీ పోస్టులకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు.