మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్ రెడ్డి విద్యార్థులతో మాక్ గ్రామపంచాయతీ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులకు సర్పంచ్ ఎన్నిక విధానం, అభ్యర్థుల అర్హతలు, ఎన్నికల గుర్తులు కేటాయించే విధానం, పోలింగ్ నిర్వహించే విధానం, ఓటు హక్కుపై ఉపాధ్యాయుడు పరమేశ్వర్ రెడ్డి అవగాహన కల్పించారు.