ప్రకాశం: చీమకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ రాజాబాబు, MLA విజయ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శివాజీ, ఎల్వీ నరసింహారావు, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.