విశాఖలో బుధవారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 2001 మంది అభ్యర్థులకు గానూ 1822 మంది (91.05%) హాజరయ్యారని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. పరీక్షల సరళిని ఆయన స్వయంగా 2 కేంద్రాల్లో తనిఖీ చేయగా, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 5 కేంద్రాలను పరిశీలించిందన్నారు. ఉదయం 5 కేంద్రాల్లో, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆయన పేర్కొన్నారు.