అఖండ-2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 14 వరకు టికెట్ల ధరల పెంచుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుతూ పర్మిషన్ ఇచ్చింది. రేపు రాత్రి 8 గం.ల ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.600 ఖరారు చేసింది. టికెట్ ధరల పెంపుతో వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని ఆదేశించింది.