NLG: చిట్యాల మండలంలోని 18 గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన పోలీసు సిబ్బందిని నియమించారు. దాదాపు 150 మంది, 150 పోలింగ్ స్టేషన్ల లో, 41 లొకేషన్స్‌లో విధులు నిర్వహించనున్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు విధుల్లో పాలుపంచుకోనున్నారు.