GNTR: ఫిరంగిపురం మండలంలోని తక్కెళ్ళపాడు, శిరంగిపాలెం గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాకు రూ. 2,389కు రైతులు తమ ధాన్యం తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల ద్వారానే అమ్మాలని సూచించారు.