W.G: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022లో పాలకొల్లు టిడ్కో గృహల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంకు టీడీపీ నేతలు గణేష్, కడలి గోపీ, అన్నాబత్తుల దుర్గారావు హాజరయ్యారు.