ATP: ఈ నెల 12, 13, 14 తేదీలలో అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా యోగాసనా అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని ఈ నెల 28 నుంచి జనవరి 2 వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలకు పంపుతామని ఆయన వెల్లడించారు.