SS: హిందూపురం పట్టణంలోని పాండురంగ నగర్లో మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి పాండురంగ నగర్లో రోడ్లు గుంతలు పడి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. త్వరలోనే క్రొత్త రోడ్లు క్రొత్త కాలువల నిర్మాణం చేపడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగేంద్రమ్మ పాల్గొన్నారు.