TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు జరిగిన ఒప్పందాలను వివరించనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై దిశా నిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.