ADB: ఆదిలాబాద్‌లోని ఆరు మండలాల్లో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా బుధవారం సూచించారు. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.