గోవా నైట్ క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తునకు ఇండియాకి వచ్చి సహకరించడానికి ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రా సోదరులు కోర్టుకు తెలిపారు. తాము థాయిలాండ్ పారిపోలేదని.. పని మీద వెళ్లామని పేర్కొన్నారు. కాగా, ఇంటర్పోల్ వీరిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.