W.G: పాలకోడేరు మండలం గరగపర్రు ఉండి కాలువపై ఉన్న వంతెనను నిర్మించాలని కోరుతూ సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్వి గోపాలన్ నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంతెన నిర్మాణం చేపట్టి 92 సంవత్సరాల అయిందని పూర్తిగా శిథిలావస్థ స్థితిలో ఉందని, వెంటనే వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.